నవరాత్రుల్లో సందర్శించాల్సిన బెస్ట్ టెంపుల్స్ ఇవే.. మిస్ అవ్వకండి మరి!

Updated on: Sep 19, 2025 | 2:11 PM

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలు అయ్యాయి. సెప్టెంబర్ 21 అమావాస్య రోజు నుంచి తెలంగాణ ఆడపడుచుల ఆటపాటలతో రాష్ట్రంలో సందడి నెలకొంటుంది. ఇక సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. అయితే చాలా మంది నవరాత్రుల సందర్భంగా వివిధ ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకోవాలి అనుకుంటారు. కాగా, మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం

1 / 5
నవరాత్రుల్లో దర్శించాల్సిన ఆలయాల్లో వరంగల్ లోని భద్రకాళి టెంపుల్ ఒకటి. ఇక్కడ అమ్మవారు భద్రకాళిగా ఏకశిలపై దర్శనం ఇస్తుంది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని దర్శించుకొని, మొక్కుకుంటే సమస్యలన్నీ తొలిగిపోయి, చాలా ఆనందంగా ఉంటారని చెబుతారు అక్కడి వారు. ఈ ఆలయం వరంగల్ హన్మకొండ రహదారిలో కొండల మధ్య తటాకం ఒడ్డున ఉంటుంది.

2 / 5
ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కూడా ఒకటి. కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రిపర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు,భక్తుల కోర్కెలను తీర్చుతూ విజవాడ కనకదుర్గమ్మగా కొలువై ఉంది. నవరాత్రుల సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించడం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు.

3 / 5
నవరాత్రుల్లో సందర్శించాల్సిన ఆలయాల్లో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ దేవి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబ దేవిగా దర్శనం ఇస్తారు.  ఈ దేవాలయంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తి పీఠం ఇక్కడ కలదు.

4 / 5
నిర్మల్ జిల్లాలో ఉన్న సరస్వతి ఆలయాన్ని కూడా నవరాత్రుల సమయంలో సందర్శించడం చాలా మంచిదంట. ఇక్కడ అమ్మవారు కృష్ణా నది ఒడ్డున శ్రీ జ్ఞాన సరస్వతిగా వెలసింది. దేవి నవరాత్రుదలు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు.

5 / 5
 మెదక్‌లోని ఏడుపాయల వన దుర్గ భవానీ ఆలయం ఫేమస్ టెంపుల్ లో ఒకటి. ఈ ఆలయంలో అమ్మవారు దుర్గ భవానీగా కొలువుదీరడం జరిగింది. దట్టమైన అడవి ప్రాంతంలో   వనదుర్గ మాత వెలసి భక్తులను కాపాడుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదం.