- Telugu News Photo Gallery These are the items that should not be kept in the office bag according to Vastu
మీ ఆఫీసు బ్యాగ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే మీ కెరీర్ గోవిందా..
పండితులు తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. కానీ కొంత మంది ఈ నియమాలను ఉల్లంఘించి అనేక సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీసు బ్యాగ్‌లో కొన్ని రకాల వస్తువులు ఉండకూడదంట. ఉంటే అవి మీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపెడుతాయంటున్నారు పండితులు. కాగా ఎలాంటి వస్తువులు ఆపీసు బ్యాగ్‌లో ఉండకూడదో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 03, 2025 | 3:54 PM

ఆఫీసుకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా తమతో బ్యాగ్ తీసుకెళ్తుంటారు. ఇక ఈ బ్యాగ్‌లో తమకు నచ్చిన వస్తువులు ఎన్నింటినో దాచుకుంటారు. అంతే కాకుండా ఆహారపదార్థాలు, లంచ్ బాక్స్ వంటివి ఆఫీసు బ్యాగ్‌లో తీసుకొని ఆఫీసుకు వెళ్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఆఫీస్ బ్యాగ్ లో పెట్టుకోవడం వలన మీరు ఎంత కష్టపడి పని చేసినా కార్యాలయంలో సరైన గుర్తింపు లభించదంట. అంతే కాకుండా అవి మీ కెరీర్ పై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కాగా, ఆఫీసు బ్యాగ్‌లో ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు చూద్దాం.

మేకప్, నగలు : చాలా మంది మహిళలు తమ బ్యాగులో మేకప్ కిట్ మెంటైన్ చేస్తుంటారు. చెవి కమ్మలు, ఫేస్ క్రీమ్స్, లిప్ స్టిక్, వంటివి ఆఫీస్ బ్యాగులో భద్రంగా దాచుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు అనేవి శుక్రగ్రహానికి సంబంధించినవంట, ఇక ఆఫీసు వాతావరణం బుధుడికి సంబంధించినది అందువలన ఈ వస్తువులను మీరు మీ ఆఫీసు బ్యాగులో పెట్టుకోవడం వలన ఇది మీకు సమస్యలను తీసుకొస్తుందంట. దీని వలన కొన్ని సార్లు మీ బాస్ మీ పైకి చాలా బిగ్గరగా అరవడం, కష్టానికి తగి ఫలితం లేకపోవడం జరుగుతుందంటున్నారు పండితులు.

షార్ప్ వస్తువులు : కొంత మంది చిన్న కత్తెర, నెయిల్ కట్టర్, చాక్ వంటివి తమ ఆఫీసు బ్యాగులో పెట్టుకొని ఆఫీసుకు తీసుకెళ్తారు కానీ ఇది అస్సలే మంచిది కాదంట. వాస్తు శాస్త్రం ప్రకారం కత్తిరించే వస్తువులు కెరీర్‌పై ప్రతి కూల ప్రభావాన్ని చూపుతాయంట. దీని వలన మీకు రావాల్సిన ప్రమోషన్ రాకపోవడం, పనుల్లో ఆటంకాలు వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

పెర్ప్యూమ్ : చాలా మంది ఆఫీసుకు వెళ్లావారి బ్యాగులో ఉండే కామన్ వస్తువు పెర్ఫ్యూమ్. అయితే దీనిని ఆఫీస్ బ్యాగులో ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు అంట. ఇది మీ మానసిక ప్రశాంతత, ఏకాగ్రతపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా మీ కెరీర్ ఎదుగుదలకు ఇది అడ్డంకుగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.

టూత్ బ్రష్ : టూత్ బ్రష్, దువ్వెన అనేది చాలా మంది మెంటైన్ చేస్తుంటారు. ఇక ఆఫీసుకు వెళ్లే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది వీటిలో కనీసం ఒక్క వస్తువైనా తమ బ్యాగులో ఆఫీసుకు తీసుకెళ్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మీ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు పండితులు.



















