
నీరు శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యంపై ప్రత్యేక్ష ప్రభావం చూపుతుంది. అందుకే తప్పకుండా శరీరానికి సరిపడ నీరు తాగాలని చెబుతుంటారు. కానీ కొంత మంది తగినంత నీరు తీసుకోక చాలా ఇబ్బందులు పడుతారు, డీ హైడ్రేషన్‌కు గురి అవుతుంటారు. అయితే ఇలా డీ హైడ్రేషన్‌కు గురి అవుతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

రక్తహీనత ప్రమాదం : ఎవరైతే సరిగ్గా నీరు తాగరో, వారు రక్తహీనతకు గురి అయ్యే ఛాన్స్ ఉన్నదంట. శరీరానికి తగింత నీరు తాగకపోవడం వలన ఇది రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీని వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోయి, చాలా సమస్యలు వస్తాయంట. అందుకే తప్పకుండా శరీరానికి తగిన నీరు తాగడం తప్పనిసరి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఒత్తిడి, ఆందోళన : నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే అవసరం అయినదానికంటే తక్కువ నీరు తాగడం వలన ఇది చాలా సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యంగా డీ హైడ్రేషన్ అనేది మెదడుపై దాని ప్రభావం చూపుతుంది. దీని వలన తల నొప్పి, చిరాకు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువ అవుతాయంట.

నోటి నుంచి దుర్వాసన : ఎవరైతే సరిగ్గా శరీరానికి తగినంత నీరు తాగరో, వారి నోటి నుంచి వింతైన దుర్వాసన వస్తుందంట. అంతే కాకుండా నోరు పొరబారటం, ఎండిపోవడం, వంటి సమస్యలు తలెత్తుతాయంట.

జుట్టు రాలడం : డీ హైడ్రేషన్ వలన జుట్టు చాలా విపరీతంగా రాలిపోతుంది. శరీరానికి సరిపడ నీరు తాగకపోతే అది జుట్టు పై ప్రత్యేక ప్రభావం చూపెట్టడమే కాకుండా, దీని వలన జుట్టు ఎక్కువగా రాలడం, జుట్టు, చర్మం పొడిగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయంట.