
గరికను ఎక్కువగా పశుగ్రసానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా దీనికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక స్థానం ఉంది. గణేషుడి పూజలో దీనిని చాలా పవిత్రంగా భావించి పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా పిండప్రదానాల సమయంలో కూడా దీనిని ఉపయోగిస్తారు. అయితే ఇది మతపరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా, ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గరికలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం , ఎసిటిక్ యాసిడ్ వంటి గ్లూకోసైడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన గరికను డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. ముఖ్యంగా శరీరానిని కావాల్సిన పోషకాలను అందిస్తుందంట.

గరికలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి. దీనిని జ్యూస్‌గా తాగడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

అలాగే శరీరంలోని వాపులకు కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేంటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వలన ఇది శరీంలోని వాపును తగ్గంచి, ఇన్ఫెక్ష్ న్స్ నుంచి కాపాడుతుంది. దీనిని తినడం వలన శరీరంలోని ఏ వాపు అయినా తగ్గిపోతుందంట.

జీర్ణ సమస్యలకు,చర్మ సంరక్షణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గరికలో ఉండే క్రిమినాశక గుణాలు, చర్మానికి సహజ మెరుపును అందిస్తాయి. అలాగే ఖాళీ కడుపుతో గరిక జ్యూస్ తాగడం వలన ఇది శరీరంలోని విషపదార్థాలనుతొలిగించి జీర్ణ సమస్యలను తగ్గిస్తుందంట.