
యాపిల్ : రోజుకు ఒక యాపిల్ పండు తింటే వైద్యుడే అవసరం లేదు అంటారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

ద్రాక్ష : ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందంట. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి ఇవి చాలా మంచివని చెబుతున్నారు నిపుణులు.

దానిమ్మ : దానిమ్మ పండులో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగు పరిచి, గుండెకు చాలా మేలు చేస్తాయి.

అరటి పండ్లు : అరటిపండ్లలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇవి రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

బెర్రీస్ : బెర్రీస్ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని ప్రతి రోజూ తినడం వలన గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.