పెరుగుతో ఎట్టి పరిస్థితుల్లో తినకూడని ఆహారాలు ఇవే!

Edited By:

Updated on: Oct 28, 2025 | 11:56 AM

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన చాలా మంది ఎక్కువగా పెరుగు తినడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భోజనం చివరలో ఒక్క ముద్దు పెరుగుతో తిననిదే అసలు భోజనం చేసినట్లు అనిపించదు అంటారు కొందరూ, అంతలా పెరుగును ఇష్టంగా తింటారు. అయితే పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఆహారాలతో అస్సలే తీసుకోకూడదంట. కాగా, ఏ ఫుడ్‌తో పెరుగు తినకూడదో ఇప్పుడు చూద్దాం.

1 / 5
పాలకూరలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే ఎక్కువ మంది కనీసం వారంలో ఒక్కసారైనా పాలకూర తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా రక్త హీనత సమస్యతో బాధపడే వారు పాలకూర తినడం చాలా ప్రయోజకరం. అయితే దీని వలన ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ, పాలకూర, పెరుగు కలిపి తినకూడదంట. ఇలా తీసుకోవడం వలన పాలకూరలోని ఆక్సాలిన్ యాసిడ్ అనేది కాల్షియం శోషణకు ఆటంకం కలిగించి కడుపు సంబంధ సమస్యలను తీసుకొస్తుందంట. అందుకే వీటిని కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు.

2 / 5
కీరదోస తినని వారు ఎవరుంటారు చెప్పండి. దీనిని చాలా మంది సలాడ్‌గా తీసుకుంటారు. అయితే దీనిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగుతో కలిపి తీసుకోకూడదంట. దీని వలన కడుపు సమస్యలు, జీర్ణక్రియలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

3 / 5
ముల్లంగి ఆరోగ్యానికి చేసే మేలు ఎంత చెప్పినా తక్కువే. ఇది శరీరాని అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ముల్లంగి, పెరుగు రెండూ కలిపి తీసుకోవడం వలన కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉన్నదంట. అంతే కాకుండా, కొన్ని సార్లు కడుపు ఉబ్బరం, గ్యాస్ , ఎసిడిటీ సమస్యలను కూడా కలిగిస్తుందంట.

4 / 5
చాలా మంది పెరులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలుపు కోని తింటారు. గతంలో పెద్దవారు ఎక్కువగా చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి తినేవారు. కానీ పెరుగుతో ఉల్లిపాయ కలిపి తినకూడదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎ:దుకంటే, పెరుగు ఉల్లిపాయ తినడం వలన ఇది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కానివ్వదంట. దీంతో కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యలు వస్తాయి.

5 / 5
వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అంతే కాకుండా ఇది చాలా ఘాటుగా ఉన్నప్పటికీ అనేక శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. అయితే శరీరానికి మంచిదే అయినప్పటికీ, పెరుగుతో పాటు వెల్లుల్లి ఎట్టిపరిస్థితుల్లో తినకూడదంట. ఇది చాలా ప్రమాదకరం.

Follow Us