క్యాన్సర్‌ను తరిమి కొట్టే ఆహారాలు..మీ డైట్‌లో తప్పక ఉండాల్సిందే!

Updated on: Jan 31, 2026 | 11:24 AM

ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాప కింద నీరులా వ్యాపిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడాలి అంటే తప్పకుండా మీ ఆహారంలో కొన్ని రకాల ఫుడ్ చేర్చుకోవాలంట. ముఖ్యంగా పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , బీన్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో పోరాడి శరీరానికి చాలా మేలు చేస్తుందంట.

1 / 5
యాపిల్స్ : యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో డైటరీ ఫైబర్, పాలీ ఫెనాల్ రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి గట్ ఆరోగ్యాన్ని కాపడటమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  ముఖ్యంగా చాలా అధ్యయనాలలో యాపిల్స్‌లలో ఉండే ఈస్ట్రోజెన్ రిసెప్టర్ నగటివ్ ఉండటం వలన ఇది రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందంట.

2 / 5
క్యారెట్స్ : క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కంటి, చర్మ ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే క్యారెట్ కూడా క్యాన్సర్ పోరాట సామర్థ్యాన్ని కలిగిఉంటుందంట. క్యారెట్లలో కెరోటినాయిడ్స్ , ఫైటో కెమికల్స్ ఉన్న స్టార్ట్లే కూరగాయ కాబట్టి, ఇది క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో కీలకంగా పని చేస్తుందంట.

3 / 5
కాఫీ :కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ ఒక కప్పు తాగడం వలన ఎండోమెట్రియల్ , కాలేయ క్యాన్సర్ సంభవం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. డెకాఫ్ కాఫీలో కెఫిన్, ఫినోలిక్ ఆమ్లం తక్కువగా ఉండటం వలన ఇది ఎండోమెట్రియల్, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందంట.

4 / 5
 నారింజ : సిట్రస్ జాతికి చెందిన నారింజ పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన ఇవి శరీరానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం తగ్గించుకోవచ్చునంట. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందంట.

5 / 5
వెల్లుల్లి : వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. వెల్లుల్లిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అనేక పరిశోధనలు సూచిస్తున్నప్పటికీ, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యంపై మానవ అధ్యయనాలు చాలా తక్కువగా జరిగాయి. కాబట్టి వెల్లుల్లి క్యాన్సర్ ప్రమాదంపై ప్రభావం పై మరిన్ని పరిశోధనలు అవసరం.