విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?

Updated on: Jul 15, 2025 | 12:20 PM

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు చాలా మంది శివాలయాలను దర్శించుకుంటారు. ఇక భారత దేశంలో అనేక రకాల శివాలయాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా అద్భుతమైన శివాలయాలు ఉన్నాయంట. కాగా, ఇతర దేశాల్లో ఉన్న ఫేమస్ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
కటాస్ రాజ్ ఆలయం: ఇది పాకిస్తాన్‌లో ఉంది. అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఇదొక్కటి. పురాతన ఆలయాల్లో కటాస్ రాజ్ ఆలయం ఒకటి. ఈ టెంపుల్ పాండవుల కాలంలో ఏర్పడినది అని చెబుతుంటారు. ఈ ఆలయం పక్కనే ఓ పెద్ద సరస్సు ఉంటుంది. ఇది శివుని కన్నీళ్ల వలన ఏర్పడినదని చెబుతుంటారు అక్కడి ప్రజలు. దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితపు ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుందంట.విభజనకు ముందు ఈ ఆలయం భారతదేశంలో ఉండేదంట.

2 / 5
మున్నేశ్వర ఆలయం : శ్రీలంకలో ఉన్న ప్రసిద్ధ శివాలయాల్లో మున్నేశ్వర ఆలయం ఒకటి. రావణుడిని చంపిన తర్వాత శ్రీరాముడు ఈ ప్రదేశంలో శివుడిని పూజించాడని చెబుతారు. అద్భుతమైన కట్టడాల్లో ఇదొక్కటి. ఈ శివాలయం మున్నేశ్వర గ్రామంలో ఉండటం వలన దీనికి మున్నేశ్వర మహాదేవ్ అనే పేరు వచ్చిందంట.

3 / 5
 పశుపతి నాథ్ ఆలయం : ఈ శివాలయం నేపాల్‌లో ఉంది. అత్యధిక మంది హిందువులు నివసించే దేశాల్లో నేపాల్ ఒకటి. ఇక్కడ 11వ శతాబ్ధంలో నిర్మించిన ఆలయం ఉంది. నేపాల్‌లో, బాగ్మతి నది ఒడ్డున ఖాట్మండు అనే నగరం లో పశుపతినాథ్ శివాలయం ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందిన ఆలయాల్లో ఒకటి.

4 / 5
రామలింగేశ్వర దేవాలయం : ఈ ఆలయాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. అంత అద్భుతంగా ఉండే ఈ ఆలయం మలేషియాలో ఉంది. మలేషియాలో ఉన్న అతి పెద్ద దేవాలయం ఇదే. దీనిని  1896లో నిర్మించినట్లు సమాచారం. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు వెళ్తుంటారంట

5 / 5
ఆక్లాండ్ శివాలయం : ఇది న్యూజ్ లాండ్‌లో ఉంది. అతి పెద్ద శివాలయాల్లో ఇదొక్కటి. ఆక్లాండ్ శివాలయ నిర్మాణం 2004లో పూర్తి చేశారంట. ఇది ఆక్లాడ్ నగరంలో ఉండటం వలన దీనిని ఆక్లాండ్ శివాలయం అంటారు. ఇక న్యూజ్ లాండ్‌లో ఉన్న ఫేమస్ ఆలయాల్లో ఇదొక్కటి.