Health: పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్‌ లోపానికి సంకేతాలు కావొచ్చు..

|

Jul 28, 2024 | 9:14 AM

1 / 5
శరీరంలో తగినంత టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ లేకపోతే ప్రధానంగా కనిపించే సమస్య లైంగికపరమైనవే. లైంగిక ఆసక్తి తగ్గడం, అంగ స్థంభన వంటి లోపాలు కనిపిస్తే ఈ హార్మోన్‌ లోపంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
టెస్టోస్టెరాన్‌ స్థాయిలు తగ్గితే కండరాల నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా బలం కోల్పోవడం, త్వరగా ఆలసిపోవడం వంటి సమస్యలు వస్తే వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

3 / 5
ఇక ఆలోచించే శక్తి తగ్గుతున్నా. ఏకాగ్రత దెబ్బతింటున్నా, విషయాలను గుర్తించలేకపోతున్నా ఇవన్నీ టెస్టోస్టెరాన్‌ స్థాయిలు తగ్గాయన్నడానికి సూచికగా చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
ఉన్నపలంగా జుట్టు రాలుతున్నా, నిత్యం నిరాశగా ఉంటున్నా, వృషణాల సంకోచం, శరీరంలో కొవ్వుల స్థాయిలు పెరిగినట్లు అనిపించినా టెస్టోస్టెరాన్‌ స్థాయిలు తగ్గినట్లు అర్థం చేసుకోవాలి. 30 ఏళ్లు నిండిన పురుషుల్లో ఈ హార్మోన్‌ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

5 / 5
టెస్టోస్టెరాన్‌ స్థాయిలను పెరగాలంటే కొన్ని రకాల విధానాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే ప్రతీ రోజూ కచ్చితంగా వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. వీటితో పాటు ఆల్కహాల్, స్మోకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.