హైదరాబాద్ చుట్టూ అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అద్భుతమైన హిల్ స్టేషన్స్, అందమైన సరస్సు, తోటల ఉన్న ప్రదేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు గనుక ఫ్యామిలీ లేదా స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తే, బెస్ట్ ప్లేసెస్ ఇవే. ఈ పర్యాటక ప్రదేశాలు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయంట. మరి ఆ ప్రదేశాలు ఏవో మీరు కూడా చూడండి.

లక్న వరం సరస్సు చాలా అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ వేలాడే వంతెన, చుట్టూ నీరు పెద్ద పెద్ద కొండలు, పచ్చటి ప్రకతి చూడటానికి చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది. మీరు గనుక పచ్చటి చెట్లు కొండల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకుంటే, మీకు ఈ ప్లేస్ బెస్ట్ అనే చెప్పాలి. ఈ ప్రదేశం దాదాపు 13 చిన్న ద్వీపాలను కలిగి ఉంటుంది. ఇది హైదరాబాద్ కు దాదాపు 225 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.

ఒక్క రోజు లేదా రెండు రోజులు మాత్రమే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే హైదరాబాద్ కు అతి దగ్గరగా ఉండే బీదర్ కోట బెస్ట్ ప్లేస్. ఈ కోటను 1428 ప్రాంతంలో అహ్మద్ షా బహమనీ ఎర్రటి లాటరైట్ రాయిని ఉపయోగించి నిర్మించారు. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మడపాలు, మసీదులు, పూలతోటలతో చాలా అద్భుతంగా ఉంటుందంట.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న తిర్యాణి మండలంలోని తిర్యాణి జలపాతం చాలా బాగుంటుంది. నీటి సెలయేళ్ల సవ్వడులు, పచ్చటి చెట్లు, దట్టమైన అడవిలో , ఎత్తైన కొండలు, ఉప్పొంగే ప్రవాహాల మధ్య మీరు ఆనందంగా గడపాలి అనుకుంటే తిర్యాణి జలపాతాలు బెస్ట్ ప్లేస్. ఇవి హైదరాబాద్ నుంచి దాదాపు 310 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.