జనవరి నుంచి మార్చి వరకు వాతావరణం అనేది చాలా బాగుంటుంది. ఇది పర్యటనలకు అనుకూల సమయం. అందుకే చాలా మంది ఈ సమయంలో ఎక్కువగా ట్రిప్స్‌కు వెళ్తుంటారు. అయితే మీరు కూడా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పర్యటనకు వెళ్లాలి అనుకుంటే, తక్కువ రద్దీ ఉండి, ఎంజాయ్ చేయడానికి భారత దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలు ఇవే.

గుల్మార్గ్ , జమ్మూ కాశ్మీర్ : భారత దేశంలో చూచదగిన ప్రదేశాల్లో జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ ఒకటి. జనవరి ప్రారంభ సమయంలో ఈ ప్రదేశం మంచుతో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి వెళితే అందమైన ప్రకృతి, మంచు కొండలు, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. కాగా, జనవరిలో టూర్ ప్లాన్ చేసే వారికి ఇది ఓ అద్భుతమైన ప్రదేశంగా చెప్పవచ్చును. జనవరి నుంచి మార్చి వరకు చూడటానికి ఇది అనుకూల సమయం. ఇక ఇక్కడ గుల్మార్గ్ గోండోలా, అఫర్వాట్ శిఖరం, మంచుతో కప్పబడిన పచ్చిక భూములు అన్నీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

జైసల్మేర్ , రాజస్థాన్ : శీతాకాలంలో చూడాల్సిన ప్రదేశాల్లో జైసల్మేర్ ఒకటి. ఇక్కడ జైసల్మేర్ కోట, పట్వోన్ కీ హవేలి, ఎడారి శివార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేయవచ్చు. జనవరిలో చూడాల్సిన అందమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. అంతే కాకుండా రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడి ఉదయ్ పూర్ కోట, సిటీ ప్యాలెస్, లేక్ పిచోలా పార్కులు ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటాయి

భారత దేశంలో చూడాల్సిన అందమైన ప్రదేశాలలో కేరళ ఒకటి. ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రకృతి ప్రేమికులు ఇష్టపడే ప్రదేశాల్లో ఇదొక్కటి. ముఖ్యంగా కేరళలోని వర్కల్ అందమైన తీర ప్రాంతం. ఇక్కడి బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, కొండలు, కేప్‌లు ఉంటాయి. అందువలన జనవరిలో ఎంజాయ్ చేయడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం.