WhatsApp: మరింత అట్రాక్టివ్‌గా వాట్సాప్‌.. త్వరలోనే మరో స్టన్నింగ్‌ ఫీచర్‌

|

Oct 11, 2024 | 11:17 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మేసేజింగ్ యాప్‌ వాట్స్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతోన్న కాలానికి, టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్‌లను తీసుకొస్తుంది వాట్సాప్‌. ముఖ్యంగా యూత్‌ను అట్రాక్ట్ చేసే క్రమంలో వాట్సాప్‌ సూపర్‌ ఫీచర్స్‌ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా వాట్సాప్‌ మరో సూపర్‌ ఫీచర్‌నుతీసుకొచ్చే పనిలో పడింది..

1 / 5
వాట్సాప్‌లో రోజురోజుకీ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అధునాతన టెక్నాలజీని జోడిస్తూ ఈ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది వాట్సాప్. ముఖ్యంగా యువతను అట్రాక్ట్‌ చేస్తూ మంచి ఫీచర్లను పరిచయం చేస్తోంది.

2 / 5
ప్రస్తుతం వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఈ మూడు మెటా యాజమాన్యంలోనే ఉండడంతో ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలోనే ట్రెండీ ఫీచర్లను వాట్సాప్‌లో కూడా తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది.

3 / 5
సెర్చ్‌ ఇమేజెస్‌ ఆన్‌ ది వెబ్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు.. తమకు చాట్‌లో వచ్చిన ఇమేజెస్‌ను గూగుల్‌లో వెళ్లి సెర్చ్ చేయవచ్చు.

4 / 5
ప్రస్తుతం ఫేక్‌ ఫొటోలు వైరల్‌ అవుతోన్న తరుణంలో వాటికి చెక్‌ పెట్టేందుకే వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తసుకొస్తోంది. మీకు వచ్చిన ఫొటో నిజమైందేనా.? లేక ఎడిట్‌ చేసిందా.? అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సదరు ఫొటో సోర్స్‌ కూడా ఏంటో చెప్పొచ్చు.

5 / 5
 ఈ ఫీచర్ వల్ల తమ యూజర్ల గోప్యతకు ఎలాంటి ముప్పు ఉండదని వాట్సాప్‌ చెబుతోంది. ప్రస్తుతం డెవలపింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే టెస్టింగ్‌కు తీసుకొచ్చి యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.