Vivo y75 4g: వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..
Vivo y75 4g: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై75 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే...
వివో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై75 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను 4జీ మోడల్‌లో లాంచ్ చేశారు.
1 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం సింగిల్ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేశారు. 8 జీబీ ర్యామ్+1280 జీబీ స్టోరేజ్ రూ. 20,999 ధరతో అందుబాటులోకి తీసుకొచ్చారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1500 డిస్కౌంట్‌ను అదనంగా అందిస్తున్నారు.
2 / 5
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12తో నడిచే ఈ ఫోన్‌లో 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ జీ96 ప్రాసెసర్‌ను ఇచ్చారు.
3 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 44 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
4 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్‌కు సపోర్ట్ చేసే 4050 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. వీటితో పాటు వైఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఇందులో ఫీచర్లుగా ఉన్నాయి.