
కాల్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కాల్ ఐడెంటిఫికేషన్ యాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. అందుకే ఈ యాప్‌కు ఇంత క్రేజ్ ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే ట్రూకాలర్ తాజాగా నాలుగు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అవేంటంటే..

స్మార్ట్ కార్డ్ షేరింగ్: ఈ ఫీచర్ సహాయంతో మెసేజ్‌లోని సమాచారాన్ని ఇతరులకు ఫోటో రూపంలో పంపుకోవచ్చు. ఇందుకోసం స్మార్ట్ కార్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మేరు పంపాలనుకుంటున్న మెసేజ్‌ను సెలక్ట్ చేస్తే అందులోని టెక్ట్స్ ఫోటో రూపంలో షేర్ అవుతుంది.

అర్జెంట్ మెసేజెస్: మనం పంపే మెసేజ్‌ను అవతలి వ్యక్తి తప్పకుండా చూడాలనుకుంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇలా పంపిన మెసేజ్‌లను అవతలి వ్యక్తి చదివే వరకు ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తూనే ఉంటుంది. అంటే యూజర చేత సదరు మెసేజ్‌ను తప్పకుండా చూసేలా చేస్తుంది. అప్పటి వరకు పాప్‌అప్ విండోలో కనిపిస్తూనే ఉంటుంది.

స్మార్ట్ ఎస్సెమ్మెస్: మన ఫోన్ ఇన్ బాక్స్‌లో వచ్చే మెసేజ్‌లలో అవసరమైన వాటికంటే ఎక్కువగా ప్రమోషన్స్‌కు సంబంధించినవే వస్తున్నాయి. దీంతో చాలా మంది మెసేజ్‌లను చదవడమే మానేశారు. అయితే దీనికి చెక్ పెట్టడానికే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో ఓటీపీ, టికెట్స్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లను ప్రత్యేక ఫోల్డర్స్‌లోకి వెళ్లేలా చేసుకోవచ్చు. యూజర్ ఇచ్చిన సంమాచారం ఆధారంగా మెసేజ్‌లు వేర్వేరు ఫోల్డర్స్‌లోకి వెళతాయి.

ఎడిట్ చాట్ మెసేజ్: మనం అవతలి వ్యక్తికి మెసేజ్ పంపిన తర్వాత కూడా ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ఈ ఫీచర్‌తో ట్రూకాలర్ అందించింది. అవతలి వ్యక్తి మెసేజ్‌లను చూసిన తర్వాత ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే మార్పలు చేసిన తర్వాత సదరు మెసేజ్ కింద చాట్ ఎడిటెడ్ అనే పదాలు కనిపిస్తాయి.