- Telugu News Photo Gallery Technology photos Samsung offering huge discount on samsung galaxy a34 5g smart phone, Check here for full details
Galaxy a34 5g: సామ్‌సంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా..
కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఇప్పటికే లాంచ్ అయిన ఫోన్‌ల సేల్స్‌ను పెంచుకునే నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సైతం స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇంతకీ ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభించనుంది.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 20, 2024 | 8:34 AM

సామ్‌సంగ్ గతేడాది గ్యాలక్సీ ఏ34 పేరతో ఓ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర లాంచింగ్ సమయంలో రూ. 30,999గా ఉండేది. అయితే తాజాగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 3000 వరకు డిస్కౌంట్‌ను అందించింది. దీంతో 6GB+128GB మోడల్ వేరియంట్ రూ.22,999లకే సొంతం చేసుకోవచ్చు.

ఇక 8GB +128GB వేరియంట్ అసలు ధర రూ. 27,499కాగా, ప్రస్తుతం రూ. 24,499లకే లభిస్తోంది. మరోవైపు 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 26,499లకే అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

గ్యాలక్సీ ఏ34 5జీ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియోటెక్ డైమెన్సిటీ 1080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే గ్యాలక్సీ ఏ34 5జీ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5G, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లను అందించారు.




