- Telugu News Photo gallery Technology photos Redmi launches redmi note 12 series Have a look on features and price details Telugu Tech News
Redmi note 12: రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్‌లు లాంచ్.. 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ తాజాగా నోట్ సిరీస్ నుంచి కొత్త ఫోన్‌లు లాంచ్ చేసింది. రెడ్‌మీ నోట్ 12, నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో+ పేరుతో మూడు ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లలో ఉన్న ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 28, 2022 | 7:10 PM

రెడ్‌మీ నోట్ సిరీస్‌లో కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. నోట్ 12 సిరీస్‌లో మూడు ఫోన్‌లను లాంచ్ చేసింది. ప్రస్తుతం చైనాలో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు.

రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మి నోట్ 12 ప్రొ, రెడ్‌మీ నోట్ 12 ప్రో+ పేరుతో మొత్తం మూడు ఫోన్‌లను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లలో 6.7 ఇంచెస్ ఓ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

రెడ్‌మీ 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాకు అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ఏకంగా 200 మెగాపిక్సెల్స్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. అంతేకాకుండా ఈ సిరీస్ ఫోన్‌లలో 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు.

రెడ్‌మీ 12లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ప్రాసెసర్‌ను అందించారు. రెడ్‌మీ నోట్ 12 ప్రో+ ఫోన్ విషయానికొస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

రెడ్‌మీ నోట్ 12ప్రో ధర రూ. 25,000 నుంచి రూ. 27,300 మధ్య లభించనుంది. రెడ్‌మీ 12 5జీ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే రూ. 13,600 నుంచి రూ. 19,300 మధ్య లభించనుంది.





























