Redmi A3x: తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్స్‌.. రెడ్‌మీ నుంచి స్టన్నింగ్ ఫోన్‌

|

May 24, 2024 | 8:38 PM

బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని మార్కెట్లోకి కొంగొత్త స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. రూ. 10 వేలలో బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ ఏ3ఎక్స్‌ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ ఏ3ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ఫోన్‌కు దీనిని అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.71 ఇంచెస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్‌లో యూనిసోక్ టీ603 చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు.

3 / 5
రెడ్‌మీ ఏ3ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌లో 3జీబీ లేదా 4జీబీ ర్యామ్‌ను అందించారు. ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లను ఇందులో ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ డెకోరేటివ్ సెన్సర్ కెమెరాలను అందించారు.

4 / 5
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 10వాట్ల వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను గ్రీన్, గ్రే కలర్స్‌లో తీసుకొచ్చారు.

5 / 5
ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇక ధర విషయానికొస్తే గతేడాది వచ్చి రెడ్‌మీ ఏ3‌ స్మార్ట్ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 7,299గా ఉండగా. రెడ్‌మీ ఏ3 ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ బేసిక్ వేరియంట్‌ ధర కూడా రూ. 10 వేలలోపు ఉండొచ్చని అంచనా.