- Telugu News Photo Gallery Technology photos Realme x7 pro ultra extreme edition with super features launched price and specifications here
Realme X7 Pro: సరికొత్త టెక్నాలజీతో రియల్‌మి ఎక్స్7 ప్రో ఆల్ట్రా ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్.. ఊహించని రీతిలో రెస్పాన్స్..
Realme X7 Pro: సరికొత్త టెక్నాలజీతో రియల్‌మి ఎక్స్7 ప్రో ఆల్ట్రా ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్.. ఊహించని రీతిలో రెస్పాన్స్..
Updated on: Apr 03, 2021 | 12:49 PM

రియల్‌మి ఎక్స్7 ప్రో ఆల్ట్రా ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్‌ను రియల్‌మి సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పటికే రియల్‌మి ఎక్స్7 -5జీ, రియల్‌మి ఎక్స్7 ప్రో -5జీ సిరీస్ ఫోన్లను విడుదల చేసిన మొబైల్ కంపెనీ.. వాటికి కంటిన్యేషన్‌గా రియల్‌మి ఎక్స్7 ప్రో ఆల్ట్రా ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

రియల్‌మి ఎక్స్7 ప్రో ఆల్ట్రా ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్‌లో సరికొత్త ఫీచర్లను పొందుపరిచారు. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరాతో పాటు.. 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. గరిష్టంగా 12 జీబీ ర్యామ్, 250 ఇంటర్నల్ స్టోరేజీ ఉంది.

రియల్‌మి ఎక్స్7 ప్రో ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ట్రిపుల్ రేర్ కెమెరా కలిగి ఉంది. ఇందులో ఎఫ్/1.8 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్/2.25 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ విత్ 4 సెం.మీ ఫోకల్ లెన్త్, ఎఫ్/2.4 అపార్చర్ కలిగి ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరా ఎఫ్ / 2.5 అపార్చర్‌తో 32 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంది.

రియల్‌మే ఎక్స్7 ప్రో ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇంకా ఈ వేరియంట్ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది. రియల్‌మి ఎక్స్7 ప్రో అల్ట్రా ఎక్స్‌ట్రీమ్ 159.9x73.4x.7.8 మిమీ, 170 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

8 జీబీ+128 జీబీ స్టోరేజీ కలిగిన రియల్‌మి ఎక్స్7 ప్రో ఆల్ట్రా ఎక్స్‌ట్రీమ్ ఫోన్ ధర భారత్‌లో సుమారు రూ. 25,600 ఉండగా.. 12జీబీ+256 జీబీ స్టోరేజీ కలిగిన రియల్‌మి ఎక్స్7 ప్రో ఆల్ట్రా ఎక్స్‌ట్రీమ్ ధర రూ. 29,000 గా ఉంది.