JioTag Air: ఈ ట్యాగ్ ఉంటే చాలు.. మీ వస్తువులు సేఫ్‌..

బైక్‌ ఎక్కడో పెట్టేస్తాం మర్చిపోతాం, వ్యాలెట్‌ కూడా అంతే పదే పదే వెతక్కుంటుంటాం. అయతే ఇలాం పదే పదే మర్చిపోయే వస్తువులు మిస్‌ అవ్వకుండా ఉండేందుకు కూడా ఓ స్మార్ట్‌ గ్యాడ్జెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే యాపిల్ వంటి సంస్థలు ఈ ట్యాగ్‌ను తీసుకురాగా.? జియో కూడా దీన్ని లాంచ్‌ చేసింది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన ఈ ట్యాగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jul 20, 2024 | 9:46 PM

తరచూ వస్తువులను ఎక్కడ పెట్టామో మరిచిపోయే వారికి ఉపయోగపడేలా ఈ డివైజ్‌ను తీసుకొచ్చారు. జియో ట్యాగ్ పేరుతో ఈ గ్యాడ్జెట్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాగ్‌ను కంపెనీ బ్లూ, గ్రే, రెడ్ కలర్స్‌లో లాంచ్‌ చేశారు.

1 / 5
ప్రస్తుతం ఈ జియో ట్యాగ్‌ జియో మార్ట్‌తో పాటు రియలన్స్‌ డిజిటల్‌, అమెజాన్‌ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికొస్తే జియోట్యాగ్‌ ఎయిర్‌ ధరను రూ. 1499గా నిర్ణయించారు.

2 / 5
ఇంతకీ ఈ ట్యాగ్ ఎలా పనిచేస్తుందంటే. ఆండ్రాయిడ్ యూజర్లు జియో థింగ్స్‌ యాప్‌ సహాయంతో ఈ డివైజ్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే యాపిల్‌ యూజర్లు ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ యాప్‌ ద్వారా ఈ డివైజ్‌ను వాడొచ్చు.

3 / 5
ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్‌ 14, ఆపై  ఆపరేటింగ్ సిస్టమ్‌ ఫోన్‌లకు ఈ ఫోన్‌ పనిచేస్తుంది. జియో ట్యాగ్‌ బ్లూటూత్‌ 5.3తో పనిచేస్తుంది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా స్పీకర్‌ అందించారు. దీంతో సౌండ్‌ ఆధారంగా ఈ వస్తువులు ఎక్కడున్నాయో కనిపెట్టొచ్చు.

4 / 5
ఇందులో అందించిన ఇన్‌ బిల్ట్ స్పీకర్‌ 90-120 db రేంజ్‌తో శబ్దం చేస్తుంది. ఈ చిన్న డివైజ్‌ బరువు కేవలం 10 గ్రాములే కావడం విశేషం. ఇందులోని వేసే బ్యాటరీ ఏడాది పాటు పనిచేస్తుంది. ఒకవేళ మీ వస్తువు ఫోన్‌ పరిధికి దూరంగా వెళ్తే వెంటనే మీకు అలర్ట్‌ వస్తుంది.

5 / 5
Follow us