Prime Day: స్మార్ట్‌ టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వీటిపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌..

ప్రస్తుతం స్మార్ట్‌ టీవీల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు భారీగా పలికిన ఈ టీవీల ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా కంపెనీల మధ్య నెలకొన్న పోటీ, ఈకామర్స్‌ సైట్స్‌ అందిస్తున్న ఆఫర్ల కారణంగా స్మార్ట్‌ టీవీలు ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెజాన్‌ నిర్వహిస్తున్న ప్రైమ్‌ డే సేల్‌లో స్మార్ట్‌ టీవీలపై భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి.? అలాంటి కొన్ని బెస్ట్‌ డీల్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jul 20, 2024 | 9:38 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్‌ జూల్‌ 21వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉంది. అయితే ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ టీవీలపై ఏకంగా 41 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

1 / 5
హయార్‌ 4కే అల్ట్రాట్‌ హెచ్‌ స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీని అమెజాన్‌ సేల్‌లో భాగంగా రూ. 36,700కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 24W స్పీకర్లను అందించారు. HDR10తో 60Hz రిఫ్రెష్ రేట్‌ ఈ టీవీ సొంతం.

2 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎల్‌జీ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీని అమెజాన్‌ సేల్‌లో భాగంగా రూ. 40,989కి లభిస్తుంది. ఈ టీవీ వెబ్‌ఓస్‌ స్మార్ట్ టీవీ, AI థింక్‌క్యూ, ఆపిల్ ఎయిర్‌ప్లే 2 & హోమ్‌కిట్, గేమింగ్ మోడ్, ఫిల్మ్‌మేకర్ మోడ్, AI ప్రాసెసర్ వంటి ఫీచర్లను అందించారు. ఈ టీవీలో WebOSతో 5 సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌ను అందించనున్నారు.

3 / 5
 తోషిబాకు చెందిన C35ONP సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీని అమెజాన్‌ సేల్‌లో భాగంగా రూ. 32,000కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ డాల్బీ విజన్ అట్మాస్ సపోర్ట్తో తీసుకొచ్చారు. ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన స్పీకర్‌లను అందించారు. ఈ టీవీ గూగుల్‌ టీవీ ఓఎస్‌తో పనిచేస్తుంది.

4 / 5
 అమెజాన్‌ సేల్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ టీవీ VU ది గ్లోలెడ్ సిరీస్. ఈ టీవీ ధర రూ. 32,999గా ఉంది. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ స్క్రీన్‌ను అందించారు. ఈ టీవీ AI GLO ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది 104W DJ సబ్‌ వూఫర్‌ను అందించారు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభించనుంది.

5 / 5
Follow us