Oppo Find X7 Ultra: కళ్లు చెదిరే ఫీచర్లతో ఒప్పో ఫోన్‌.. ఏమన్నా ఫీచర్సా అసలు..

|

May 28, 2024 | 10:36 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో ఓవైపు బడ్జెట్ ఫోన్‌లతో పాటు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లను సైతం విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా పేరుతో ఓ ప్రీమియం ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించింది ఒప్పో. ఇంతకీ ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రాలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో గత కొన్ని రోజుల క్రితం మార్కెట్లోకి ఎప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రపంచలోనే తొలి క్వాడ్‌ మెయిన్‌ కెమెరా విత్ హైపర్‌టోన్‌ ఇమేజ్‌ ఇంజన్‌తో తీసుకొచ్చిన ఫోన్‌ ఇదే కావడం విశేషం.

2 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో హాసెల్‌బ్లాడ్ బ్రాండెడ్ క్వాడ్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన నాలుగు రెయిర్ కెమెరాలను అందించారు.

3 / 5
ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో సోనీ లేటెస్ట్ 1 ఇంచ్ టైప్ ఎల్‌వైటీ-900 సెన్స‌ర్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

4 / 5
ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌లో 100 వాట్స్‌ సూపర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. పైన్‌ షాడో, సిల్వర్‌ మూన్‌, వ్యాస్ట్‌ సీ, స్కై కలర్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 70 వేలుగా ఉంది.

5 / 5
ఈ స్మార్ట్‌ పోన్‌ కేవలం 40 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తోకూడిన కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1600 నిట్స్‌ ఫుల్ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు.