- Telugu News Photo Gallery Technology photos Oppo F27 pro plus 5G to Honor Magic v Flip top phones launching in this week
Smartphone: స్మార్ట్‌ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈ వారం లాంచ్ అవుతోన్న కొత్త ఫోన్స్ ఇవే..
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌ల హవా సాగుతోంది. మరీ ముఖ్యంగా భారత మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. రకరకాల ఫీచర్లతో, అలాగే ప్రస్తుతం దేశంలో విస్తరిస్తున్న 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే విధంగా ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి వస్తున్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 11, 2024 | 10:23 AM

రోజుకో కొత్త ఫీచర్‌తో ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. బడ్జెట్ మార్కెట్‌తో పాటు ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లోకి కొన్ని కొత్త ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వారం లాంచ్ అవుతున్న కొన్ని ఫోన్స్, వాటి ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Honor 200 Series: జూన్ 13వ తేదీన హానర్ 200 సిరీస్‌ను లాంచ్ చేయనున్నారు. తొలుత చైనాలో లాంచ్ కానున్న ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. కాగా హానర్ 200 సిరీస్‌లో భాగంగా హానర్ 200, హానర్ 200 ప్రో ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్‌ఓసీని అందించనున్నారు. పూర్తి వివరాలు లాంచింగ్ రోజు తెలియనున్నాయి.

Honor Magic V Flip: ఈ వారంలో వస్తున్న మరో ఫోన్ హానర్ మ్యాజిక్ వీ ఫ్లిప్. ఈ ఫోన్‌ను జూన్ 13వ తేదీన తొలుత చైనాలో లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌లో 3.4 ఇంచెస్‌తో కూడిన కవర్ డిస్‌ప్లే, 6.7 ఇంచెస్‌తోకూడిన మెయిన్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఇందులో 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నట్లు అంచనా. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు.

Oppo F27 pro plus 5G: ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను జూన్ 13వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌లో ఐపీ69 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు. ఇక ఫోన్ ఫిజికల్ డ్యామేజ్ కాకుండా 360 డిగ్రీల ఆర్మర్ బాడీని అందించారు. అలాగే డిస్‌ప్లే కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్2ని అందించారు.

Xiaomi 14 CIVI: ఈ వారం అందుబాటులోకి వస్తున్న మరో షావోమీ 14 సివి. ఈ ఫోన్‌ను జూన్ 12వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు.




