Moto G22: మోటోరోలా నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 10 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..

Moto G22: ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీ మోటోరోలా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఏప్రిల్‌ 14లోపు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి...

Narender Vaitla

|

Updated on: Apr 09, 2022 | 10:50 AM

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం మోటోరాలో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఏప్రిల్‌ 13 నుంచి అందుబాటులోకి రానుంది.

1 / 5
ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ 90 హెచ్‌జెడ్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. మోటో జీ 22 ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో విడుదల చేసిన ఈ ఫోన్‌లో మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

2 / 5
ఇక ఇందులో 20 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో వైఫై, టైప్ సీ పోర్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, బ్లూటూత్ 5.0 సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

3 / 5
 కెమెరా విషయానికొస్తే ఇందులో క్వాడ్‌ కెమెరా సెటప్‌ అందించారు. నాలుగు రెయిర్‌ కెమెరాల్లో భాగంగా 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 10,999గా నిర్ణయించారు. ఏప్రిల్‌ 13న సేల్ ప్రారంభం కానుంది. అయితే ఏప్రిల్‌ 14లోపు ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి రూ. 9,999కే అందుబాటులో ఉండనుంది.

5 / 5
Follow us