- Telugu News Photo Gallery Technology photos How to share photos on WhatsApp without saving the phone number?
ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోకపోయినా.. వాట్సాప్‌లో ఫొటోస్ ఎలా పంపాలో తెలుసా?
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరుంటున్నారు చెప్పండి. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కువగా వాడే యాప్‌లో వాట్సాప్ ముందుంటుంది. దీని ద్వారా చాట్ చేసుకోవడమే కాకుండా, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ పీడీఎఫ్స్ ఇలా చాలా వాటిని మనం ఇతరులకు షేర్ చేసుకోవడం చాలా ఈజీ.
Updated on: Feb 24, 2025 | 11:00 AM

చాలా వరకు వాట్సాప్‌లో ఫోటోస్ షేర్ చేయాలంటే, మన కాంటాక్ట్ లిస్టులో ఉన్నవాళ్లకే పంపే అవకాశం ఉంది. దీంతో కొత్త వారికి ఫోటోస్ షేర్ చేయాలంటే, నెంబర్ సేవ్ చేసుకొని పంపిన తర్వాత డిలీట్ చేసుకోవాలి. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

ముఖ్యంగా ఏదైనా మీసేవా లేదా ఆన్ లైన్ సెంటర్‌కు వెళ్లినప్పుడు. డాక్యుమెంట్స్ షేర్ చేయడానికి నెంబర్ సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నెంబర్ సేవ్ చేసుకోకున్నా వాట్సాప్ ద్వారా ఫోటోస్, వీడియోస్ షేర్ చేయోచ్చునంట. అది ఎలా అంటే?

వాట్సాప్ ఓపెన్ చేస్తే .. వాట్సాప్ కిండ రైట్ సైడ్ చవరన కాల్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. అయితే దాని మీద క్లిక్ చేయాలంట.

తర్వాత కాల్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే అక్కడ పైన మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.

అందులో మీరు కాల్ ఏ నెంబర్ పైన క్లిక్ చేయడంతో డయల్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు నెంబర్ ఎంటర్ చేయగానే, కింద కాల్ సింబల్ పక్కన మెసేజ్ సింబల్ కనిపిస్తుంటుంది. దాని ద్వారా మీరు ఫొటోస్, డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవచ్చు. ఇలా నెంబర్ సేవ్ చేసుకోకపోయినా ఫొటోస్ పంపచ్చు.