Honor X9C: హానర్‌ నుంచి కిరాక్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ తెలిస్తే మీరూ ఇదే అంటారు..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్న చైనా స్మార్ట్ దిగ్గజ సంస్థలు. ఈ క్రమంలోనే తాజాగా హానర్ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్‌ ఎక్స్‌9సీ పేరుతో గ్లోబల్‌ మార్కెట్లోకి ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. త్వరలోనే భారత మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Nov 07, 2024 | 9:13 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ హానర్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. హానర్‌ ఎక్స్‌9సీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ అమ్మకాలు ఇప్పటికే మలేషియాలో ప్రారంభమయ్యాయి. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

1 / 5
ధర విషయానికొస్తే హానర్‌ ఎక్స్‌9సీ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 28,700కాగా.. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ ఏరియంట్‌ ధర రూ. 32,500గా నిర్ణయించారు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 1,224 x 2,700 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ పోన్‌ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

3 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్‌ మ్యాజిక్ ఓఎస్ 8.0తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
హానర్‌ ఎక్స్‌ 9సీ స్మార్ట్‌ ఫోన్‌లో 66 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6600 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను సియాన్‌, టైటానియం బ్లాక్‌, టైటానియం పర్పుల్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ65 రేటింగ్‌ను ఇచ్చారు.

5 / 5
Follow us