- Telugu News Photo Gallery Technology photos Here are the best 5g smart phones under 15k, check out details
Smart phones under 15k: పాకెట్ ఫ్రెండ్లీ ధరతో అదిరిపోయే ఫీచర్లు.. ఈ ఫోన్లు నిజంగా ఆల్ రౌండర్లే..
స్మార్ట్ ఫోన్ల తయారీలో పోటీ వాతావరణం నెలకొంది. అన్ని దిగ్గజ కంపెనీలు సరసమైన ధరల్లో తమ ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఒకప్పుడు అధిక ధరలు పెడితే గానీ లభ్యమవ్వని ఫీచర్లు ఇప్పుడు తక్కువ ధరల్లోనూ వస్తున్నాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు కంపెనీలు ఏ విధంగా పోటీపడుతున్నాయో అనేది. కేవలం రూ. 15,000 లోపు ధరలోనే 5జీ కనెక్టివిటీతో పాటు శక్తివంతమైన సీపీయూ, డ్యూయల్ కెమెరా సెటప్, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు, బెజెల్ లెస్ స్క్రీన్, ఫేస్ అన్‌లాక్, గ్లాస్ శాండ్ విచ్ నిర్మాణం వంటి అత్యాధునిక ఫీచర్లున్న ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అటువంటి బెస్ట్ ఐదు ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వీటిని మార్కెట్ వర్గాలు ఆల్ రౌండర్లు అని పిలుస్తారు. ఆ ఆల్ రౌండర్ వంటి పెర్ఫామెన్స్ అందించే ఫోన్లపై మీరూ ఓ లుక్కేయండి..
Madhu |
Updated on: Apr 04, 2023 | 2:00 PM

రియల్‌మీ 10(Realme 10).. తక్కువ ధరలో వినియోగదారులకు అద్భుతమైన ఫీచర్లను ఈ ఫోన్ అందిస్తుంది. మీడియా టెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది. 4జీబీ నుంచి 8జీబీ వరకూ ర్యామ్ సైజ్ అందుబాటులో ఉంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో కూడిన అమోల్డ్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50ఎంపీ రిజల్యూషన్‌తో ఉంటుంది. సెకండరీ కెమెరా 2ఎంపీ సెన్సార్ తో వస్తుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. దీని ధర రూ. 14,479 నుంచి ప్రారంభమవుతుంది.

రియల్‌మీ 9ఐ(The Realme 9i) ఇది కూడా రియల్ మీ 10 ను పోలి ఉంటుంది.ఇంచుమించు అవే ఫీచర్లు ఉన్నాయి. మీడియా టెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది. 4జీబీ నుంచి 6జీబీ వరకూ ర్యామ్ సైజ్ అందుబాటులో ఉంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో కూడిన అమోల్డ్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50ఎంపీ రిజల్యూషన్‌తో ఉంటుంది. సెకండరీ కెమెరా 2ఎంపీ సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16ఎంపీ ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. దీని ధర రూ. 14, 900 నుంచి ప్రారంభమవుతుంది.

రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ(Redmi 11 Prime 5G).. సరమైన ధరలో లభించే మరో బెస్ట్ 5జీ ఫోన్ ఇది. రూ. 12,999 నుంచి లభిస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ఎస్‌ఓసీతో శక్తిపొందుతుంది. 4జీబీ వరకు ర్యామ్‌ని కలిగి ఉంది. దీనిలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్‌కెమెరా ఉన్నాయి.

పొకో ఎం5(POCO M5).. ఇది తక్కువ బడ్జెట్‌లో ఒక అద్భుతమైన ఫోన్‌గా కనిపిస్తుంది. మన దేశంలో దీని ధర రూ. 12,499 నుంచి ప్రారంభమవుతుంది. మీడియా టెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది. 18W పాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీతో కూడిన 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

ఐక్యూఓఓ జెడ్6 లైట్ 5జీ(iQOO Z6 Lite 5G).. ఈ ఫోన్ అద్భుతమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. దీని ప్రారంభ ధర దాదాపు రూ. 15,000గా ఉంది. 120Hz ప్యానెల్‌తో కూడిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4జెన్ 1 చిట్ సెట్ తో వస్తుంది. అత్యతం చవకైన 5జీ హ్యాండ్ సెట్లలో ఇది కూడా ఒకటి.





























