- Telugu News Photo Gallery Technology photos Google planning to introduce shielded email feature for stop spam mails
Gmail: జీమెయిల్‌లో సూపర్ ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరికీ ఈమెయిల్ ఐడీ తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు కేవలం అధికారిక అవసరాల కోసం మాత్రమే ఉపయోగించే ఈమెయిల్‌ను ఇప్పుడు అన్నింటికీ ఉపయోగించాల్సి వస్తుంది. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా గూగుల్ జీమెయిల్‌లో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది..
Updated on: Nov 21, 2024 | 2:51 PM

జీమెయిల్ ఉపయోగించే వారు ఎదుర్కొనే సమస్యల్లో స్పామ్ మెయిల్స్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనకు తెలియకుండానే చాలా చోట్ల మెయిల్ ఐడీని ఇచ్చేస్తుంటాం. దీంతో కుప్పలుతెప్పలుగా స్పామ్ మెయిల్స్ వేధిస్తుంటాయి.

ఇలాంటి అవసరం లేని మెయిల్స్‌తోనే ఇన్‌బాక్స్ మొత్తం నిండిపోతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే జీమెయిల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. షీల్డ్ ఈ మెయిల్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది గూగుల్.

ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు తాత్కాలికంగా ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షీల్డ్ ఈ-మెయిల్ ఐడీతో వినియోగదారులు ఏదైనా యాప్ నుంచి అకౌంట్‌లోకి లాగిన్ కావొచ్చు. ఈ ఐడీ కేవలం పది నిమిషాలు మాత్రమే పని చేస్తుంది.

మళ్లీ అవసరం అనుకుంటే యూజర్ల కొత్త షీల్డ్ ఈమెయిల్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పామ్ మెయిల్స్‌తో యూజర్లు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే గూగుల్ ఈ ఫీచర్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. కాగా యాపిల్ ఇప్పటికే యూజర్ల కోసం ఇలాంటి ఫీచర్‌ను తీసుకొచ్చింది. హైడ్ మై ఈమెయిల్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌తో తాత్కాలిక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని యాప్ లో లాగిన్ కావచ్చు.




