- Telugu News Photo Gallery Technology photos Flipkart republic day sale 2024 Huge discount on MOTOROLA g54 5G smart phone
Motorola G54: రూ. 6 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్.. ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా గృహోపకరణాలు మొదలు స్మార్ట్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మోటోరోలో జీ54, 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jan 24, 2024 | 4:35 PM

మోటోరోలా జీ54 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఊహకందని డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అసలు ధర రూ. 17,999కాగా 27 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 13,999కి సొంతం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ ఇక్కడితోనే ఆగలేదు.. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీ, యాక్సిస్ బ్యాంకు వంటి కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 750 డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 7000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ లెక్కన ఈ ఫోన్‌ను రూ. 6 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 33 వాట్స్‌కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇందులో 16.6 సెంటీమీటర్ల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.




