- Telugu News Photo Gallery Technology photos Follow these tricks to check whether google photos is fake or real
Google: మీరు చూస్తున్న ఫొటోలు అసలా, నకిలీవా..? ఇలా తెలుసుకోండి.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఊపందుకుంటోంది. అన్ని రంగాల్లో ఏఐ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఏఐ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఫొటోలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో మనం చూస్తున్న ఫొటో నిజమైందేనా, కాదా అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే కొన్ని ట్రిక్స్ ద్వారా గూగుల్‌లో మీరు చూస్తున్న ఫొటో నిజమైందో, కాదో ఇలా తెలుసుకోవచ్చు..
Updated on: Jan 18, 2024 | 9:50 PM

గూగుల్‌లో ఫొటోల కోసం సెర్చ్ చేసినప్పుడు వందల సంఖ్యలో ఫొటోలు వస్తాయి. అయితే ఆ ఫొటోల్లో కొన్ని నకిలీ ఫొటోలు కూడా ఉంటాయి. దీంతో మనం చూస్తున్న ఫొటో నిజమైందో, కాదో అనే అనుమానం వస్తుంది. ఇంతకీ ఏది అసలు ఫొటోనో, ఏది నకిలీ ఫొటోనో ఇలా గుర్తించాలి.

సాధారణంగా గూగుల్‌లో ఏదైనా ఫొటో కోసం సెర్చ్ చేయగానే ఫొటోలు ప్రత్యక్షమవుతాయి. మనం చూస్తున్న ఫొటో అసలో కాదో తెలియాలంటే ముందుగా సదరు ఫొటోను ఓపెన్ చేయాలి. అనంతరం పైన కుడివైపు కనిపించే మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి.

తర్వాత అందులో అబౌట్ దిస్ ఇమేజ్ పై క్లిక్ చేయాలి. దీంతో ఆ ఫొటోకు సంబంధంచిన వివరాలు వస్తాయి. మొదటి సారి ఆ ఫొటో ఎప్పుడు అప్‌లోడ్ అయ్యింది.? ఆ ఫొటోను ఏయే సైట్స్‌లో ఉపయోగించారు. ఆ ఫొటోల విశ్వసనీయత తెలుసుకోవచ్చు.

ఇక ఒకవేళ మీరు చూసిన ఫొటో ఏఐ టెక్నాలజీతో రూపొందించారనే అనుమానం వస్తే 'రివర్స్ సెర్చ్' చేసి తెలుసుకోవచ్చు. ఇందుకోసం సదరు ఫొటోను కాపీ చేసే గూగుల్ ఇమేజెస్ సెర్చ్ బాక్సులో ఫొటోను అప్‌లోడ్ చేసి సెర్చ్ చేస్తే ఆ ఫొటో నిజమైందో లేదో తెలుసుకోవచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఫొటోలు సాధారణ ఫొటోలతో పోల్చితే చాలా తేడాగా ఉంటాయి. ఫొటోను జూమ్ చేసి చూస్తే పిక్సెల్స్ గిజిబిజిగా కనిపిస్తాయి.




