- Telugu News Photo Gallery Technology photos Motorola launches new smartphone Moto g play 2024 features and price details
Moto g play 2024: మోటోరోలా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ కూడా సూపర్
ఇటీవల వరుసగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా. ముఖ్యంగా రూ. 15 వేలలోపు బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొచ్చిన మోటోరోలా తాజాగా మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్‌ను తెచ్చింది. మోటో జీ ప్లే 2024 పేరుతో ఈ ఫోన్‌ను ప్రస్తుతం అమెరికాలో లాంచ్ చేసింది...
Updated on: Jan 19, 2024 | 6:03 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలో తాజాగ మోటో జీ ప్లే 2024 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం..

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 720X1600 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ స్క్రీన్ అందిస్తుంది. కోరింగ్ గొరిల్ల గ్లాస్ 3ని అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. ఈ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ మన కరెన్సీలో రూ. 12,500 వరకు ఉండొచ్చు.

కెమెరా విషయానికొస్తే మోటీ జీ ప్లే 2024 స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఫ్రంట్ కెమెరాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు.




