- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on VW 32 inches smart TV, Check here for full details
VW Smart TV: రూ. 7 వేలకే 32 ఇంచెస్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ.. ఫీచర్స్ కూడా అదుర్స్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగానే పలు కంపెనీలకు చెందిన టీవీలపై భారీ డీల్స్ లభిస్తోంది. అలాంటి బెస్ట్ డీల్‌లో vw స్మార్ట్ టీవీ ఒకటి. 32 ఇంచెస్ టీవీపై ఏకంగా 56 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 14, 2024 | 1:54 PM

వీడబ్ల్యూ 32 ఇంచెస్‌తో లైనక్స్ సిరీస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 16,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 56 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని కేవలం రూ. 7499కే సొంతం చేసుకోవచ్చు.

అయితే ఈ డిస్కౌంట్స్ ఇక్కడితో ఆగలేవు. అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 220 వరకు క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ టీవీని నెలకు రూ. 367 చెల్లించి కూడా ఈఎమ్‌ఐ ఆప్షన్‌తో సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీలో 32 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఈ టీవీతో 18 నెలల వారంటీని అందించారు. అలాగే ఇందులో 720 పిక్సెల్స్ రిజల్యూషన్ స్క్రీన్‌ను ఇచ్చారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.

ఇక ఈ టీవీలో వైఫై, యూఎస్‌బీ, ఈథర్ నెట్, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఈ టీవీ మిరకాస్ట్‌తో పాటు ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లైవ్, యప్ టీవీతో పాటు మరెన్నో యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇక ఈ టీవీలో ఐపీఈ టెక్నాలజీని అందించారు. అలాగే ఎకో విజన్, సినిమా మోడ్, సినిమా జూమ్ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఈ టీవీ స్క్రీన్ 16.7 మిలియన్ కలర్స్‌కు సపోర్ట్ చేస్తుంది.




