అబ్బ.. పుల్లగా ఉందని తెగ తింటున్నారా..? లైన్ క్రాస్ అయ్యారో షెడ్డుకే..

Updated on: Jul 19, 2025 | 12:57 PM

అబ్బ.. చింతపండు అనగానే నోరూరుతుంది.. ఇది చాలా పుల్లగా రుచికరంగా ఉంటుంది.. అయితే.. చింతపండును.. మనం తినే కూరలను విడదీసి చూడలేం.. ఎందుకంటే.. మన వంటలో భాగం.. మనం తినే అనేక రకాల కూరల్లో, చారులో, రసంలో, చట్నీలలో ఇలా అనేక కూరల్లో చింతపండును ఉపయోగిస్తారు. దీంతో పులిహార కూడా చేసుకుని తింటారు..

1 / 7
అబ్బ.. చింతపండు అనగానే నోరూరుతుంది.. ఇది చాలా పుల్లగా రుచికరంగా ఉంటుంది.. అయితే.. చింతపండును.. మనం తినే కూరలను విడదీసి చూడలేం.. ఎందుకంటే.. మన వంటలో భాగం.. మనం తినే అనేక రకాల కూరల్లో, చారులో, రసంలో, చట్నీలలో ఇలా అనేక కూరల్లో చింతపండును ఉపయోగిస్తారు. దీంతో పులిహార కూడా చేసుకుని తింటారు.. అందుకే.. చాలా ఆహారాలు చింతపండు లేకుండా అసంపూర్ణంగా కనిపిస్తాయి. చింతపండులో విటమిన్ సి, ఎ ఇతర విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి.. చింతపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ.. దీని అధిక వినియోగం ఆరోగ్యానికి హాని కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 7
చింతపండులో టార్టారిక్ యాసిడ్, ఎసిటిక్, సుక్సినిక్ యాసిడ్స్, పెక్టిన్, టానిన్స్, ఆల్కలాయిడ్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ లాంటివి కనిపిస్తాయి.. డైటీషియన్ల ప్రకారం.. రోజుకు 10 గ్రాముల చింతపండు తీసుకోవడం సురక్షితం.. అయితే రుచి కోసం ఇంతకంటే ఎక్కువగా చింతపండు తింటే అనేక రకాల నష్టాలను భరించాల్సి వస్తుందని.. ఒక్కోసారి హానికరం కూడా కావొచ్చని హెచ్చరిస్తున్నారు. చింతపండును ఎక్కువగా తీసుకుంటే.. చాలా సమస్యలు వస్తాయంటున్నారు. చింతపండు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకోండి..

3 / 7
అజీర్ణం: చింతపండులో టానిన్‌లతో సహా అనేక సమ్మేళనాలు ఉంటాయి.. ఇవి జీర్ణం కావడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. మీరు దీన్ని ఎక్కువ పరిమాణంలో తింటే, కడుపులో యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఇది అపానవాయువు, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర కడుపు సమస్యలను కలిగిస్తుంది.

4 / 7
బ్లడ్ షుగర్ తక్కువ అవుతుంది: చింతపండు ఎక్కువగా తింటే.. మీ శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. దీని కారణంగా తల తిరగడం, బలహీనత మొదలవుతుంది.. ముఖ్యంగా.. డయాబెటిస్ మందులు వాడుతున్న వారు చింతపండు తీసుకోకుండా ఉండాలి.

5 / 7
దంతాల సమస్యలు: చింతపండును ఎక్కువగా తీసుకుంటే దంతాల సమస్యలు వస్తాయి.. దంతాల నిర్మాణం, ఎనామిల్ దెబ్బతింటుంది. అదేవిధంగా దంతాలు బలహీనంగా కూడా మారవచ్చు.

6 / 7
గర్భధారణ సమయంలో తినకపోవడం మంచిది: గర్భిణీలు చింతపండు తీసుకోవడం మంచిది కాదు. దీన్ని అధికంగా తినడం వల్ల శరీరంలో వేడి పెరిగి.. కడుపులో పెరుగుతున్న పిల్లలపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా తల్లిపాలు ఇచ్చే స్త్రీలు చింతపండుకు దూరంగా ఉండటం బెటర్..

7 / 7
నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది.