
నిపుణుల అభిప్రాయం ప్రకారం శీతాకాలంలో వీలైనంత వరకు అరటిపండ్లు తినడం మానుకోవాలి. అరటిపండ్లు తినడం మరింత చలిని కలిగిస్తాయి. చల్లని వాతావరణంలో అరటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా జలుబు వచ్చే అవకాశం ఎక్కువ.

గుండెకు రక్షణ.. రక్తపోటుకు చెక్: అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతూ.. గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే ఇందులోని మెగ్నీషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

Banana Benefits

అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. అయితే శీతాకాలంలో అరటిపండ్లు తినడం ప్రయోజనకరంగా ఉందా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో అరటిపండ్లు తినడం వల్ల జలుబు, దగ్గు వస్తుందని పలువురి నమ్మకం.

అరటిపండ్లు తినాలని అనిపిస్తే మధ్యాహ్నం వేళల్లో తినడం మంచిది. శీతాకాలంలో రాత్రి, ఉదయం వేళల్లో అరటిపండ్లు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సమయాల్లో అరటి పండ్లు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.