- Telugu News Photo Gallery Sun Flower Seeds take daily improve eyesight, check here is details in Telugu
Eye Care: కంటి చూపు మెరుగు పడాలా.. చిటికెడు తినండి చాలు!
ప్రస్తుత కాలంలో చాలా మంది కంటి చూపుతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇప్పుడున్న వర్క్ స్ట్రెస్, సెల్ ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడటం, పోషకాహార లోపం వల్ల కూడా కంటి చూపు అనేది మందగిస్తుంది. అదే విధంగా వివిధ రకాల లైటింగ్ వల్ల కూడా కంటి చూపుపై ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కంటి చూపు ఎక్కువ కాలం దెబ్బ తినకుండా ఉండాలంటే మన కంటిలో ఉండు రెటీనా ఆరోగ్యం బాగుండాలి. అప్పుడప్పుడూ కంటికి సంబంధించిన ఆహారం తినడం..
Updated on: Jan 23, 2024 | 12:40 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది కంటి చూపుతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇప్పుడున్న వర్క్ స్ట్రెస్, సెల్ ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడటం, పోషకాహార లోపం వల్ల కూడా కంటి చూపు అనేది మందగిస్తుంది. అదే విధంగా వివిధ రకాల లైటింగ్ వల్ల కూడా కంటి చూపుపై ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

కంటి చూపు ఎక్కువ కాలం దెబ్బ తినకుండా ఉండాలంటే మన కంటిలో ఉండు రెటీనా ఆరోగ్యం బాగుండాలి. అప్పుడప్పుడూ కంటికి సంబంధించిన ఆహారం తినడం వల్ల కూడా కంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి అనుకుంటారు. కానీ ఇతర పోషకాలు కూడా కావాలి.

రెటీనా ఆరోగ్యం మెరుగు పడాలంటే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం అవుతాయి. ఇది ఎక్కువగా సన్ ఫ్లవర్ సీడ్స్‌లో (పొద్దు తిరుగుడు గింజలు) ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కంటి చూపు మెరుగు పడటమే కాకుండా కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

కంటి కణాలు హెల్దీగా ఉండాలంటే జింక్, లూటిన్ వంటి యాంటీ ఆక్సింట్లు కావాలి. ఇవి ఎక్కువగా సన్ ఫ్లవర్ సీడ్స్‌లో లభ్యమవుతాయి. అదే విధంగా ఈ గింజల్లో విటమిన్లు సి, ఇ వంటివి కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ చిటికెడు పొద్దు తిరుగుడు గింజల పొడిని తీసుకుంటూ ఉంటే కంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

అంతే కాకుండా కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. ఎంత వర్క్ ఉన్నా గంటకు కనీసం ఓ ఐదు నిమిషాలైనా కంటికి రెస్ట్ ఇవ్వడం మేలు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ.. పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.




