
వారు ద్రాక్ష పండ్లను ప్రతి రోజూ తినే వారిపై అధ్యయనం చేయగా, అందులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయంట. ముఖ్యంగా ద్రాక్ష పండ్లు తినే వారి ఆరోగ్యం క్రమంగా చాలా మెరుగు పడిందంట. ముఖ్యంగా గుండె సంబంధ సమస్యల ప్రమాదం చాలా వరకు తగ్గిందని వారు తెలియజేశారు. ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి కారణం అవుతున్నాయని వారు తెలియజేయడం జరిగింది.

పరిశోధకులు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న కొందరిని సర్వే చేయగా అందులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయంట. ముఖ్యంగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా 40 ద్రాక్షలు తినే వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడమే కాకుండా, గట్ బ్యాక్టీరియా కూడా మెరుగు పడిందని వారు తెలిపారు.

ముఖ్యంగా వీరిలో LDL కొలెస్ట్రాల్ స్థాయిలు దాదాపు ఎనిమిది శాతం వరకు తగ్గిందని, అలాగే శరీరంలోని హనికరమైన కొవ్వులకు ఇదంనంగా పనిచేసే పిత్త ఆమ్లాల స్థాయిలు కూడా 40 శాతానికి పైగా తగ్గినట్లు వారు పేర్కొన్నారు. దీని వలన ప్రతి రోజూ ద్రాక్ష పండ్లు తినడం వలన ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వారు సూచిస్తున్నారు.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించమే కాకుండా ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాకు ఇవి దోహద పడుతున్నాయంట. ప్రతి రోజూ ద్రాక్ష పండ్లు తినడం వలన ఇవి గట్ బ్యాక్టీరియాను మెరుగు పరిచి, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇవి మలబద్ధకం, గ్యాస్ , ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గించడంలో కీలకంగా పని చేస్తాయంట.

అందుకే పరిశోధకులు ద్రాక్ష పండ్లను సూపర్ ఫుడ్ అని అన్నారు. ఎందుకంటే, ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతే కాకుండా, బరువు నియంత్రణకు, గట్ ఆరోగ్యానికి, కాలేయ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ద్రాక్ష పండ్లు జీవక్రియను పెంచుతాయంట. ఇవి శరీరంలో కేలరీలను బర్న్ చేసి, ఫ్యాటీ లివర్ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.