Period Stomach Pain: పీరియడ్స్‌లో కడుపునొప్పి బాగా వస్తోందా.. ఇవే కారణాలు కావచ్చు!

|

Jan 16, 2025 | 3:45 PM

పీరియడ్స్‌లో సాధారణంగానే కడుపులో నొప్పి, నడుము నొప్పి అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇవి కొంత మందికి మాత్రం మరింత తీవ్రంగా వస్తాయి. రోజువారీ పనులు కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

1 / 5
సాధారణంగానే మహిళలకు పీరియడ్స్ అంటేనే భయం. నెలసరి సమయంలో బ్లీడింగ్ అవుతూ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరికొంత మందికి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా కడుపులో నొప్పి, నడుము నొప్పి వస్తుంది.

2 / 5
ఈ సమయంలో రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నొప్పిని భరించడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కడుపులో నొప్పి ఎక్కువగా వచ్చినా, బ్లీడింగ్ ఎక్కువగా జరిగినా అందుకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.

3 / 5
నెలసరిలో నొప్పి రావడానికి గర్భాశయ ఫైబ్రాయిడ్లు కూడా ఒక కారణం కావచ్చు. దీని కారణంగా కూడా అధిక రక్త స్రావం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటి తిత్తులుగా పెరగడం వల్ల ఇలా అవుతుంది.

4 / 5
టాక్సిక్ షాక్ సిండ్రోమో కారణంగా కూడా రుతుక్రమంల నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా చెబుతారు. స్టెఫిలో కాకస్ శరీరంలోకి ప్రవేశించి.. విషాన్ని రిలీజ్ చేసినప్పుడు టాక్సిక్ షాక్ సిండ్రో‌మ్‌కు దారి తీస్తుంది.

5 / 5
ఎండోమెట్రియోసిస్ కారణంగా కూడా పీరియడ్స్‌లో నొప్పి తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఈ ఎండోమెట్రియోసిస్ గర్భాశయం లోపలే ఉంటుంది. కానీ కొందరికి మాత్రం గర్భసంచి వెలుపల కూడా ఉండొచ్చు. దీని కారణంగా కూడా తీవ్రంగా నొప్పి ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఎండోమెట్రియోసిస్ కారణంగా కూడా పీరియడ్స్‌లో నొప్పి తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఈ ఎండోమెట్రియోసిస్ గర్భాశయం లోపలే ఉంటుంది. కానీ కొందరికి మాత్రం గర్భసంచి వెలుపల కూడా ఉండొచ్చు. దీని కారణంగా కూడా తీవ్రంగా నొప్పి ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)