- Telugu News Photo Gallery Sports photos Ipl 2021 srh vs rcb head to head records rcb look to consolidate position as srh eye first win
IPL 2021 SRH vs RCB Records: హాట్, హాట్ ఫైట్.. గెలుపు మాత్రం స్వీట్.. మరి సమరంలో విజేత ఎవరంటే..!
హైదరాబాద్, బెంగళూరు జట్ల కెప్టెన్లు తమ జట్టులోనే కాకుండా లీగ్‌లోనూ అగ్రశ్రేణి ఆటగాళ్లలో స్థానం పొందారు. అయితే ఈ రోజు జరుగనున్న పోరులో ఎవరి సత్తా ఎంటో ఓ సారి చూద్దాం..
Updated on: Apr 14, 2021 | 6:25 PM

ఐపీఎల్2021లో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు తలపడనున్నాయి. గణాంకాల పరంగా ఇరు జట్లు దాదాపు సమానంగా ఉన్నాయి.

ఐపీఎల్ లీగ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో ఆర్‌సీబీ ఏడు, హైదరాబాద్ 10 మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. ఒక మ్యాచ్ మాత్రం డ్రాగా ముగిసింది. ఈ 18 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఐపీఎల్ 2016 ఫైనల్‌కు చేరింది.

విరాట్ కోహ్లీ.. RCBకి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా సన్‌రైజర్స్ తరఫున ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. సన్‌రైజర్స్‌పై విరాట్ 531 పరుగులు చేయగా... అదే సమయంలో వార్నర్ విరాట్ కూడా ఆర్‌సిబికి వ్యతిరేకంగా 593 పరుగులు చేశాడు.

గత సీజన్‌లో జరిగిన లీగ్ రౌండ్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. మొదటి మ్యాచ్‌ను RCB గెలుచుకోగా, రెండో మ్యాచ్‌కు SRH దక్కించుకుంది. దీని తరువాత ఎలిమినేటర్‌లో ఇరు జట్లు ఫేస్ టు ఫేస్ తలపడనున్నాయి.




