Happy Birthday David Warner: 43 సెంచరీలు, 71 అర్ధ సెంచరీలు..15,045 రన్స్.. ‘డేవిడ్ భాయ్’ పేరిట ఎన్నో రికార్డులు.
అతడు క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడంటే ప్రత్యర్ధి బౌలర్లలో వణుకు పుట్టాల్సిందే. ఓటమి అంచులలో ఉన్న జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందిస్తాడు. మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేయగల సత్తా అతడి సొంతం.
Phani CH |
Updated on: Oct 27, 2021 | 3:18 PM

32 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఘనుడు.. డేవిడ్ వార్నర్

ఫార్మాట్ ఏదైనా కూడా విధ్వంసానికి పెట్టింది పేరు.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం

తనదైన శైలి ఆటతీరుతో ర్యాంకింగ్‌లో అంచలంచలుగా పైపైకి దూసుకుపోయాడు

తెలుగు పాటలకు టిక్ టాక్ వీడియోలు చేసి మనోడుగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్‌లో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ట్రోఫీని కూడా అందించాడు.

తన ఆటతోనే కాదు క్యారెక్టర్‌తోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

2018లో బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో నిషేధానికి గురయ్యాడు. ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.

2021 ఐపీఎల్ సీజన్‌లో కెప్టెన్సీ కోల్పోయిన వార్నర్.. అభిమానుల మనసుల్లో మాత్రం సుస్థిరంగా నిలిచిపోయాడు.





























