టెస్టు క్రికెట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్. 77 మ్యాచ్ లు ఆడిన ఈ ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్.. 27 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో 7540 పరుగులు సాధించాడు. మరో 55 ఇన్నింగ్స్‌లో 2460 పరుగులు చేస్తే అత్యంత ఫాస్టెస్ట్ 10,000 సాధించగలిగిన రికార్డు బ్రేక్ చేయగలడు. అతడికి ఇది పెద్ద అసాధ్యం కాకపోవచ్చు.