ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీపావళి వేసందడి మొదలైంది. దీపావళి అంటే తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిపి ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ పండుగలో ఒక్కోరోజు ఒక్కో ప్రాముఖ్యత, గుర్తింపు కలిగి ఉంది. దీపావళి వేడుకల్లో భాగంగా లక్ష్మీ దేవి, రాముడు, కృష్ణుడు, నాగేంద్రుడు ఆరాధనకు అంకితం చేయబడింది.ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ వివిధ దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ధన్ తేరాస్ రోజు నుండి షాపింగ్ తో పండగ ప్రారంభమవుతుంది.. యమ ద్వితీయతో ముగుస్తుంది. ఈ ఐదు రోజులూ సర్వత్రా భక్తి, సంతోషాల వాతావరణం నెలకొంటుంది. అయితే పండగ సన్నాహాలు చాలా రోజుల ముందుగానే చేసుకుంటారు. ఈ పండగ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..