మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశి వారికి బుధ, శుక్ర, గురు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలలో కొద్దిగా రాజయోగం అనుభవించే అవకాశం ఉంది. ఏ పని చేసినా విజయవంతం కావడం, ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ అనుకూల పరిస్థితులు అనుభవానికి రావడం వంటివి జరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏ విధమైన లోటు ఉండదు. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు టెక్నాలజీ నిపుణులు వంటి వృత్తుల వారు తప్పకుండా పురోగతి చెందే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతానయోగం కలిగే అవకాశం కూడా ఉంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఉద్యోగులకు దూరప్రాంతం నుంచి మంచి ఆఫర్ అందవచ్చు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. నమ్మించి మోసగించే స్నేహితులు ఉంటారు.