కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆరవ స్థానంలో శనీశ్వరుడు, ఏప్రిల్ తర్వాత నుంచి భాగ్య స్థానంలో గురువు కారణంగా ఈ ఏడాదంతా దాదాపు సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఏప్రిల్ తర్వాత నుంచి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఈ రాశివారికి గురువు అనుగ్రహం బాగా అనుభవానికి వస్తుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. అయితే, సప్తమంలో రాహువు సంచారం వల్ల శుభ కార్యాల మీదా, దైవ కార్యాల మీదా ఖర్చులు పెరుగుతాయి. బుధ, శుక్రులు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల మీ మాటకు, చేతకు విలువను పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలు, ఆలోచనలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనం కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా బంధుమిత్రుల్లో కూడా ఆదరణ పెరుగుతుంది. సప్తమ రాహువుల వల్ల సంసార జీవితంలో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలకు, అభిప్రాయాలకు విలువ నివ్వడం మంచిది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి.