
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ అయిన మకర సంక్రాంతి వచ్చేస్తుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, రక రకాల పిండి వంటలు, కోడి పందాలతో చాలా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం, అత్యంత పవిత్రమైన పండుగలలో ఇదొక్కటి, సూర్యుడు మకర రాశిలోకి సంచరించడాన్ని ఈ పండుగ సూచిస్తుంది. కాగా, ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ ఎప్పుడు, తేదీ ముహూర్తం గురించి వివరంగా తెలుసుకుందాం.

2026వ సంవత్సరం జనవరి 14న ప్రజలందరూ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇది తీవ్రమైన చలికాలం నుంచి వెచ్చటి, పొడవైన పగటి కాలం కదలికను సూచిస్తుంది. అంటే సంక్రాంతి తర్వాత పగలు అనేది చాలా ఎక్కువా ఉంటుందంటారు పెద్దవారు. అలాగే పంట చేతికి వచ్చే సమయాన్ని సూచిస్తుంది. అందుకే దీనిని కొన్ని ప్రాంతాల వారు పంట కోత పండుగగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగ, ఈ రోజున వ్యవసాయ పనిముట్లను పూజించడం, ఎద్దులను పూజించి వాటికి ఆహారం పెట్టడం వంటివి చేస్తుంటారు. రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ పండుగను జరుపుకుంటారు.

ఇక జనవరి 14, 2026లన ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. పుణ్యకాలం విషయానికి వస్తే, 2 గంటల 32 నిమిషాల పాటు ఇద కొనసాగుతుంది. మహా పుణ్యకాలం 1 గంట, 45 నిమిషాల పాటు ఉంటుంది. మకర సంక్రాంతి ముహూర్తం విషయానికి వస్తే, పంచాంగం ప్రకారం భక్తులందరూ, జనవరి 14 మధ్యాహ్నం3:13 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:45 నిమిషాలకు ముగిసిపోతుంది. ఈ సమయంలోనే మకర సంక్రాంతి ఆచారాలు పాటించాలని చెబుతుంటారు పండితులు.

మహా పుణ్య కాలం అనేది 3 :13 నిమిషాలకు ప్రారంభమై, 4:58 నిమిషాలకు ముగిసిపోతుంది. అయితే ఈ సమయంలో సూర్య భగవానుడిని పూజించడం, సూర్య దేవుడిని ఆరాధించడం చేయాలంట. మకర సంక్రాంతి రోజు ఎవరు అయితే బ్రహ్మముహుర్తంలో లేచి, స్నానం ఆచరించి, సూర్యుడికి కలశంలో నీటిని నింపి, నువ్వులు, ఎర్రటి పూలు, బియ్యం సమర్పిస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుందంట.

అలాగే ఈ రోజు భక్తుల అందరు, సూర్య భగవానుడి విగ్రహం లేదా చిత్రపటంపై తిలకం, గంధపు చెక్క పేస్ట్‌ను పూసి, బియ్యం పిండి, వెర్మిలియన్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. అలాగే సూర్య భగవానుడు ఎరుపు రంగు దుస్తులను సూర్య భగవానుడికి సమర్పించి, కిచిడిని ప్రసాదంగా పెట్టడం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి, వీరిని విజయం వర్తిస్తుందంట.