వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యథిపతి శుక్రుడు పంచమ కోణంలోనూ, రాహువు లాభ స్థానంలోనూ ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. శత్రు, రోగ, రుణ బాధలు చాలా వరకు తగ్గి ఉంటాయి. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలే కాక, వ్యాపారాలు కూడా నిలకడగా సాగిపో తాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ విజయం లభిస్తుంది.