తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశిలో సంచరిస్తున్న శుక్రుడు, షష్ట స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శని కారణంగా ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. నిరుద్యోగులకు సొంత ప్రాంతంలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావా దేవీల వల్ల బాగా లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ముఖ్యమైన దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు లాభిస్తాయి. తరచూ స్కంద స్తోత్రం చదువుకోవడం వల్ల శుభం జరుగుతుంది.