Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారు వీలైనంత జాగ్రత్త.. 12 రాశుల వారికి వారఫలాలు

| Edited By: Janardhan Veluru

Dec 22, 2024 | 5:01 AM

వార ఫలాలు (డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కూడా సజావుగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి దాదాపు ఈ వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అనుకున్న పనులు, చేపట్టిన ప్రయత్నా లన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. మిథున రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి గురు, శుక్ర, శని బలం బాగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కూడా సజావుగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. విద్యా ర్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యు లేషన్ల వల్ల అధిక లాభాలుంటాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడి బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. భరణి నక్షత్రం వారికి ఊహించని విధంగా అధికార యోగం పడుతుంది.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశిలో ఉన్న గురువు, దశమ స్థానంలో ఉన్న శని, లాభ స్థానంలో ఉన్న రాహువు, భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడు అనేక సమస్యల నుంచి, కష్టనష్టాల నుంచి గట్టెక్కిస్తారు. దాదాపు వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అనుకున్న పనులు, చేపట్టిన ప్రయత్నాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితంలో చిన్నా చితకా సమస్యలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి చికాకుటుంటాయి. కృత్తికా నక్షత్రం వారికి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పూర్తి చేయడంలో శ్రమ, తిప్పట పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచే కాక, సహోద్యోగుల నుంచి కూడా సమస్యలు తలెత్తుతాయి. తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో ముందుకు సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి ఆశించిన ఫలితాలనిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. పునర్వసువారికి అధికార యోగం ఉంది.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గురు, బుధ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం కొద్దో గొప్పో పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగిపోతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వ్యాపా రాలు బిజీగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ పెరుగు తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. పుష్యమి వారికి ధన యోగం పడుతుంది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి పంచమ స్థానంలో, ధన, లాభాధిపతి బుదుడు చతుర్థంలో, గురువు దశమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతితో పాటు వేతనాలు కూడా పెరిగే అవ కాశం ఉంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. రాదనుకుని వదిలేసు కున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూ లంగా కొనసాగుతాయి. పుబ్బా నక్షత్రం వారికి అనుకోని రాజయోగం పట్టే అవకాశం ఉంది

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): భాగ్య స్థానంలో గురువు, పంచమ స్థానంలో శుక్రుడు, షష్ట స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడడం జరుగుతుంది. ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా విజయవంతం అవుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభం ఉండ వచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకో వడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూ లంగా ఉంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు పురోగతి చెందు తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. హస్తా నక్షత్రం వారికి పదోన్నతి లభిస్తుంది.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడికి చతుర్థ స్థాన స్థితి వల్ల వారమంతా అనుకూలతలతో, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ముఖ్యమైన ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. లాభదాయక వ్యవహారాలు చేపడతారు. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి వస్తుంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కొందరు బంధుమిత్రుల వల్ల, ప్రయాణాల వల్ల కొద్దిగా ధన నష్టం కలిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. విద్యార్థులు పురోగతి చెందు తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. భరణి నక్షత్రం వారికి శుభవార్త అందుతుంది.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): సప్తమంలో ఉన్న గురువు, ధన స్థానంలో ఉన్న రవి వల్ల ఆదాయానికి లోటుండదు కానీ, ఇంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం, అదనపు బాధ్యతలు తప్పక పోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమానంతర ఫలితం ఉంటుంది. వారమంతా జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. ఆదాయం నిలక డగా ఉంటుంది. అనారోగ్యాల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి నుంచి కొద్దిగా ఊరట కలుగుతుంది. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. అనూరాధ నక్షత్రం వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): భాగ్య స్థానాధిపతి రవి ఇదే రాశిలో ఉండడం, ధన స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో శని సంచారం ఈ రాశివారికి వారమంతా అనుకూలంగా ఉండడం వల్ల అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆదాయం అనేక వైపుల నుంచి పెరుగుతుంది. అప్రయత్న ధన లాభం కూడా కలుగు తుంది. కుటుంబపరంగా కూడా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్య మైన వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం లభి స్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయాలు పెరుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధి స్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పూర్వాషాఢ వారికి ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఇదే రాశిలో శుక్రుడి సంచారం, ధన స్థానాధిపతి శని ధన స్థానంలోనే ఉండడం, లాభ స్థానంలో బుధుడు ఉండడం వగైరాల వల్ల ఈ రాశివారికి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. సోదరులతో ఆస్తి, ఆర్థిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యో గులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉత్తరాషాఢ వారికి హోదా పెరుగుతుంది.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రాశ్యధిపతి శని ఇదే రాశిలో ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి పనిలోనూ భారం ఎక్కు వగానే ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. శ్రమ పడితే కానీ ఫలితం ఉండకపోవచ్చు. లాభ స్థానంలో రవి, దశమ స్థానంలో బుధుడి వల్ల ఉద్యోగపరంగా అనేక అనుకూలతలు కలుగుతాయి. ఉద్యో గంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ప్రభుత్వమూలక గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అరుదైన ఆపర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజన కంగా సాగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధి స్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. శతభిషం వారికి ధన యోగం కలుగుతుంది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): లాభ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి, భాగ్య స్థానంలో బుధుడు బాగా అనుకూలంగా ఉన్నాయి. వారమంతా హ్యాపీగా, సాఫీగా, విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయ త్నాలన్నీ సానుకూలంగా నెరవేరుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహా రాలు సాఫీగా సాగుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆశించిన పదవీ యోగం పట్టే అవకాశం ఉంది.