వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు భాగ్యంలో, రవి, బుధ గ్రహాలు సప్తమంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయటా సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు కోరు కున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.