మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగాల్లో బాధ్యతలు, హోదాలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలను మించి అభివృద్ది చెందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. బంధువుల నుంచి శుభ కార్యాల ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.