- Telugu News Photo Gallery Spiritual photos Venus transit brings financial benefits and good luck to the three zodiac signs
శుక్రుడి సంచారం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. శుక్ర గ్రహం సంపదకు చిహ్నం. అంతే కాకుండా ఇది లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది. అయితే సకల సిరిసంపదలను ఇచ్చే శుక్ర గ్రహం తుల రాశిలోకి సంచారం చేయనుంది. దీంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నది.
Updated on: Oct 30, 2025 | 5:54 PM

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. శుక్ర గ్రహం సంపదకు చిహ్నం. అంతే కాకుండా ఇది లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది. అయితే సకల సిరిసంపదలను ఇచ్చే శుక్ర గ్రహం తుల రాశిలోకి సంచారం చేయనుంది. దీంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నది.

నవంబర్ రెండో తేదీన తులసి వివాహం జరపనున్నారు. అయితే ఈ అత్యంత శుభ సమయంలోనే శుక్రగ్రహం, తుల రాశిలోకి సంచారం చేయనుంది. అయితే 12 రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపగా, మూడు రాశుల వారికి మాత్రం అనుకోని విధంగా ఆర్థికప్రయోజనాలు అందించనున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కన్యా రాశి : కన్యారాశి వారికి సంపద పెరగనున్నది. ఎవరైతే చాలా రోజుల నుంచి స్థిరాస్తి లేదా, కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. కొత్త అవకాశాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంటాబయట అనుకోని మార్పులు చోటు చేసుకోనున్నాయి.

తుల రాశి : తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. బంధాలు మరింత బలంగా మారుతాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ గ్యారెంటీ, ఎవరైతే మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో, వారికి వివాహం నిశ్చయం అయ్యే ఛాన్స్ ఉంది.

మీన రాశి : మీన రాశి వారికి శుక్రగ్రహ సంచారం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. వివాహం కాని వారికి, వివాహం జరిగే యోగం ఉంది, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానున్నది.