
వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని రకాల సంకేతాలు అశుభకరమైనవంట. అటువంటి సమయంలో అలాంటి వాటిని గుర్తించి, తగు పరిహారాలు చేయడమో లేదా తప్పనిసరిగా ఇంటిని వదిలివేయడమో చేయాలి అంట. లేకపోతే ఆ ఇంటిలో నివసించేవారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, ఆ సంకేతాలు ఏవి అంటే?

ఏ ఇంటిలో అయితే,సరిగ్గా సూర్యరశ్మి పడదో ఆ ఇంట్లో అస్సలే ఉండకూడదంట. దీని వలన ఆ ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, కలహాలు మాత్రమే ఉంటాయంట. అందుకే సూర్యరశ్మి, సూర్య కిరణాలు ఇంటిలో పడకపోతే, ఆ ఇంటిని విడిచిపెట్టడమే ఉత్తమం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అలాగే ఎవరి ఇంటిలోనైతే వెంటిలేషన్ సరిగ్గా ఉండదో, అలాగే ఎవరి ఇంట్లో అయితే విపరీతమైన బూజు ఉంటుందో ఆ ఇంటిలో అస్సలే నివాసం ఉండకూడదంట. కొంత మంది వారానికి ఒక్కసారి బూజు తీసినా , మళ్లీ ఇంటిలో బూజు వస్తూనే ఉంటుందంట. అయితే అలాంటి ఇంటిలో ఉండకూడదని చెబుతున్నారు వాస్తు పండితులు.

అదే విధంగా ఇంట్లో బల్లులు ఉండటం కామన్, అయితే ఎవరి ఇంట్లోనైతే ఎక్కువగా బల్లులు, ముఖ్యంగా పది కంటే ఎక్కువ బల్లు ఎవరి ఇంట్లో ఉంటాయో, బల్లుల శబ్ధం ఎవరి ఇంట్లో ఎక్కువగా కనిపిస్తుందో వారు అస్సలే ఆ ఇంటిలో ఉండకూదంట. అలాగే చెదలు ఎక్కువగా ఉన్న ఇంటిలో కూడా ఎక్కువ రోజులు నివసించకూడదంట.

ఇక ఏ భూమిలో అయితే సహజ సిద్ధంగా బొగ్గు పండుతుందో, అలాగే ఎవ్వరైనా ఇంటి నిర్మాణం కోసం పునాది తీసినప్పుడు ఎముకలు కనిపిస్తాయో, ఆ భూమిలో ఎట్టిపరిస్థితుల్లో ఇల్లు నిర్మించకూడదంట. అలాగే భయంకరమైన ముళ్ల చెట్లు పెరిగే చోట కూడా ఇంటి నిర్మాణం చేపట్టరాదంట.